Search
  • TPN Acharyulu

మీ కోసం – సామెతలు

సామెత: బాదరాయణ సంబంధం


“ బాదరాయణ సంబంధం “ అనే సామెతను వివరిస్తాను. అవధరించండి చుట్టరికంలేకపోయినా ఏదోవిధంగ సంబంధం కలుపుకొని, ప్రయోజనం పొందాలి అనుకొనే వారు ఈ సామెతను వాడుతారు. ఇది ఎలావచ్చిందో తెలుసుకొందాము. బాదరాయణుడు, వ్యాసుడు ఒకరే అని కొందరివాదన.! కాని పురాణేతిహాసాలు వ్రాసిన వ్యాసుడు బ్రహ్మసూత్రాలు వ్రాసిన బాదరాయణుడు ఒకరుకాదు ఇద్దరువేరువేరు అని విమర్శకులఅభిప్రాయం. వ్యాసుడు నల్లగా ఉన్నందున కృష్ణ అని,నదులమధ్య ఉన్న ద్వీపంలోపుట్టినందున‘ కృష్ణద్వైపాయనుడని,’ పేరుపొంది, (వేదాన్ వివ్యాస ) వేదాలను విభజించి “వేదవ్యాసునిగా” వాసిగాంచెను. అట్లేబదరీవనంలో

( బదరీ అంటే రేగుపండు) పుట్టిన ఋషి బాదరాయణుడు అయినాడు. వేరువేరు స్థలాలు వేరువేరుకాలాలలో పుట్టిన వీరు ఒక్కటే అని చెప్పటానికి. ఈ బాదరాయణ సంబంధం అనే సామెత వచ్చింది.

వ్యాస,బాదరాయణుల సంబంధం గూర్చి ఇంకొంచంవివరిస్తాను. వ్యాసుడు అనేదిపేరుకాదు,అది ఒక పదవి. ఒక్కో ద్వాపరంలో ఒక్కొక్కరువ్యాసపదవిని అలంకరించేరు. “ ప్రజాపతి, శుక్రుడు,బృహస్పతి,వసిష్ఠుడు,త్రివర్ణుడు,సనద్వాజుడు” మొదలగువారు.వ్యాసపదవిని అలంకరించేరు. మహాభారతం, భాగవతాదిగ్రంథాలు వ్రాసిన వ్యాసుడు “వ్యాసం వసిష్ఠ నప్తారంశక్తేపౌత్రం” అన్న శ్లోకానుసారం వసిష్ఠునిమునిమనవడు,శక్తియొక్కమనవడు,పరాశరుని పుత్రుడు, శుకునితండ్రి. బదరీవనంలోబ్రహ్మసూత్రాలు రచించినది “ బాదరాయణవ్యాసుడు” చూసార వీరిమధ్య సంబంధానికి ఎంత వివరణవుందో!! ఇపుడు ఓ చిన్ని కధ. “ ఓవ్యాపారి వేరే ఊరు వెళుతూ, ఆకలి వేసి ఒక యింటి ముందు తన యెడ్లబండిని ఆపి ఎడ్లని ఆయింటిముందున్న చెట్టుకికట్టి, ఇంట్లోకివెళ్ళి హాయిగా కూర్చొని అలసట తీర్చుకొంటున్నాడట, ఆయింటి యిల్లాలు అంతచొరవగా లోపలకివచ్చిన వ్యక్తి భర్తవైపు బంధువు అనుకొని భోజనంపెట్టిందట.అపుడే బయటకు వెళ్ళి వచ్చిన భర్త భార్య అంత మర్యాదగా భోజనంపెడుతుంటే, భార్యవైపు బంధువు అనుకొన్నాడట. భోజనంచేసినబాటసారి కాస్త విశ్రాంతి తీసుకొని బయలుదేరే సమయంలో భార్యాభర్తలిద్దరికి సందేహంవచ్చి ‘ అయ్యా! మీరు ఎవరివైపు బంధువులు’ అని అడిగినవారికి ఆబాటసారి “మీయిద్దరికీ నేనుఏమికాను కాని, నా బండి చక్రాలు బదరీ (రేగు) చెక్కతోచేసినవి, మీయింట్లో బదరీచెట్టువుంది(రేగుచెట్టు). కనుక మనది “ బాదరాయణసంబంధం” అని చెప్పి చక్కావెళ్ళేడుట. ఈ కధకిప్రమాణం ఈ శ్లోకం—— “ అస్మాకంబదరీచక్రం/ యుష్మాకం బదరీతరుః/ బాదరాయణసంబంధం/ యూయంయూయం, వయంవయం. బాదరాయణ సంబంధానికి ఇంతచరిత్రవుంది.

సామెత: తిన్నయింటివాసాలు లెక్కించుట


“తిన్నయింటివాసాలు లెక్కించుట” అన్న సామెతను వివరిస్తాను. ఎవరైనా మనకు ఉపకారం చేస్తే వారికి మనం కృతజ్ఞత చూపక, అపకారం తలపెడితే అట్టివారి విషయంలో ఈసామెతని వాడుతారు. దీనిని ఓ చిన్ని కథతో వివరిస్తాను. అవధరించండి. రామాపురం అనేవూరిలో రామయ్యఅనేవ్యాపారి వ్యాపారం చేసుకొంటూతన సొంతయింట్లో ఉంటూ, కాలం గడుపుతూ ఉంటాడుఒకరోజు సోమయ్యఅనేదూరపుచుట్టం ఆవూరిలోపనివుందని రామయ్య యింటికివస్తాడు. పూర్వం అతిధిని బాగా చూసుకొనేవారు. రామయ్యకూడ సోమయ్యనిబాగా చూసుకొనేవాడు. నిజానికి సోమయ్యకు పనేమిలేదు. సోమరికూడ. రోజూహాయిగా రెండుపూటలా తిని, చాపమీద హాయిగా పడుక్కుని, ఏమి తోచక ఆ యింటికి “ వాసాలు( దూలాలు) ఎన్ని, కిటికీలు ఎన్ని , తలుపులు ఎన్ని అని లెక్కపెడుతూ కాలం గడిపేవాడు. కొన్నాళ్ళకి ఆయింటి వివరాలన్నీ కంఠతావచ్చాయి. ఇలా కొన్నాళ్ళుగడిచాయి. ఎంతకాలమైనకదలక యిట్లోనే ఉన్న సోమయ్యతో రామయ్య “ అయ్యా తమరు ఎప్పుడు వెళతారు” అని అడిగిన రామయ్యతో కుటిల బుద్దిగలసోమయ్య “ నేను వెళ్ళడమేమిటి! మీరుకదా వెళ్ళాలి” అంటాడు . ఆశ్చర్యంతో రామయ్య నాయింట్లోంచి నన్ను వెళ్ళమని చెప్పడంఏమిటి!? అని అన్న రామయ్యతో, ‘ ఈయిల్లునాదిఅని దబాయిస్తాడు’ సోమయ్య. ఇలా కాసేపు వాదులాడుకొని, న్యాయాధికారివద్దకు వెళతారు. ఇద్దరి వాదనలువిన్న న్యాయాధికారి సాక్ష్యంగా ఆఇంటివివరాలు చెప్పమంటాడు. రామయ్య ఎపుడు,ఎలాకట్టిందో చెబుతాడు, సోమయ్య తనవాదనవినిపిస్తూ వాసాలు , కిటికీలు,తలుపుల లెక్కలు కూడ చెబుతాడు.న్యాయాధిపతి సేవకులను పంపి వివరాలు చూసిరమ్మనగా, వారు చూసివచ్చి ‘ సోమయ్య చెప్పిన లెక్క సరిపోయిందని చెబుతారు. న్యాయాధికారి “వాసాలతో “ సహా లెక్కచెప్పిన ఆ యిల్లుసోమయ్యదే యని, రామయ్యను ఆ యిల్లు వదలి పొమ్మనితీర్పు చెబుతాడు. “ తిన్న యింటి వాసాలనేలెక్కించి” తన యిల్లు కాజేసిన సోమయ్యను తిట్టుకొంటూరామయ్య యిల్లువదలి వెళ్ళిపోతాడు. అలా ఈ సామెత యేర్పడింది.

సామెత: సింగినాదం జీలకర్ర


“ సింగినాదం జీలకర్ర” అన్న దాన్ని వివరిస్తాను. ఈసామెతని ఎవరైనా ఒక సామాన్య విషయాన్ని గొప్పగా చెప్పేసందర్భంలో వాడుతారు. సింగినాదంఅన్న పదానికి అర్ధమే లేదు.మరి సింగినాదానికి జీలకర్రకిసంబంధమేలేదు. దీని అసలురూపం “ శృంగనాదం, జీలకర్ర” పూర్వం గోదావరి లంక గ్రామలలోఉండే ప్రజలకు కావలసిన సరకులను పడవలలో వచ్చి అమ్మేవారుట. పడవ వచ్చింది సరకులు కొనుక్కోండి అని తెలపడానిక ‘కొమ్ము బూర ‘ ఊదేవారు.ఆ నాదం విని పడవ వద్దకు వచ్చి కావలసిన సరుకులు కొనుక్కొనేవారు.కొమ్ముబూర శబ్దాన్ని సంస్కృతంలోశృంగనాదం అంటారు. ఆశృంగనాదంవిన్న ఓగృహిణి ఇంకొకరితో” అదిగోశృంగనాదం జీలకర్ర కొనాలి అన్న సందర్భంలో “ఈ శృంగనాదం జీలకర్ర” అన్న సామెత ఏర్పడింది. అదేకాలక్రమంలో “ సింగినాదం జీలకర్రగా”మారింది.

సామెత: తోటకూరనాడే చెప్పనైతినిరా కొడుకా


“ఏకఃస్వాదు న భుంజీత “ రుచికరమైన పదార్ధం ఒక్కరే తినకూడదు. అని ఆర్యోక్తి. అలాగే మంచి,మంచి విషయాలు నలుగురితోపంచుకోవాలి. అందుకనేనాకుతెలిసిన విషయాలు మీతో పంచుకొంటున్నాను. చదివి సంతసించండి. ఈరోజు “ తోటకూరనాడే చెప్పనైతినిరా కొడుకా “ అన్న సామెత ఎలా వచ్చిందో తెలుసుకొందాం. చిన్నపిల్లలు తప్పు చేస్తే వారికి వెంటనేబుద్ది చెప్పి మంచిమార్గంలో పెట్టాలి. లేకుంటేవాళ్ళు పెద్దయాక పెద్దపెద్ద తప్పులు చేసి ఆపదలపాలు అవుతారు.అలాంటి వారి విషయంలో ఈ సామెత వాడుతారు. ఎలాగో వివరిస్తాను. “ పూర్వం చంద్రగిరి అనే ఊరిలోదుర్గమ్మ తనకొడుకు భీమయ్యతో ఓచిన్నిఇంట్లో ఉండేది. తండ్రిలేనికొడుకుని దుర్గమ్మ గారాబంగా ( ముద్దుగ) చూసుకొనేది. అతిగారాబంవల్ల భీమయ్య చెడుసావాసాలు చేస్తూ జులాయిగ తిరుగుతుండేవాడు. ఒక రోజు ప్రక్కయింటి వారి పెరటిలో ఏపుగా పెరిగిన తోటకూరను వారు చూడకుండా కోసుకువచ్చి తల్లికి యిచ్చికూరవండమంటాడు. ఎలా తెచ్చాడో అని తెలుసుకొనక కొడుకు తోటకూర తెచ్చినందుకుమురిసిపోతు, కూర వండి పెడుతుంది. పాపం భీమయ్య తల్లి సంతోషం చూసి, తాను చేసినపనిసరైనదేయనితలచి, మరునాడు ఇంకొకరి పెరటిలోంచి అరటికాయలుదొంగలించి తెస్తాడు. అపుడుకూడ తల్లి యేమి అనదు. ఇలా చిన్న, చిన్న దొంగతనాలు చేస్తూ పెరిగి పెద్దవాడై, గజదొంగగా మారి, ఒకరోజు రాజుగారి ధనాగారంలో దొంగతనానికి వెళ్ళి భటులకు దొరికిపోతాడు. రాజు వాడికి మరణ దండన విధిస్తాడు.మరణదండన అమలుచేయటానికి భటులు భిమయ్యనుఓ బండికి కట్టి వూరేగిస్తున్నపుడు, కొడుకు దుస్థితిని చూసిన దుర్గమ్మ గుండెలు బాదుకుని, వలవల యేడుస్తూ, “ తోటకూర తెచ్చిన నాడే అది తప్పు అని చెప్పివుంటే ఈ రోజు నీకు ఇలా జరిగేదికాదుకదా!” అని “ తోటకూర నాడే చెప్పనైతినరా కొడుకా” అని అనుకొంటుంది. అలా ఈ సామెతవచ్చింది.

సామెత: రామాయణంలో పిడకల వేట


” రామాయణంలో పిడకల వేట” అన్న సామెతను తెలుసు కొందాం. ఏదైన ముఖ్యవిషయం వివరించే సమయంలో అప్రస్తుత ప్రసంగం చేస్తే ఈసామెత వాడుతారు. రామాయణంలో పిడకలను వేటాడడం ఏమిటి!?యుక్తి యుక్తంగా లేదు కదా? ఇది ఎలా వచ్చిందో రెండు విధాలుగ వివరిస్తాను. జానపద రామాయణంలో సీతారామలక్ష్మణులు పంచవటిలో వున్నపుడు సీతామాతకు ఓ పీడ కల వస్తుందని, ఆ కలలో రాముడు మాయలేడిని వేటాడటానికి వెళ్ళి ఆపదలపాలౌతాడనీభయపడుతుంది.ఆ పీడకలలో వేట అనే వాక్యం “ పిడకల వేట” గా,మారివుండవచ్చు. ఇంకోవివరణ రామాయణంలో అక్కడక్కడ ‘ ఆరామాల’ ప్రసక్తి కనబడుతుంది. ఆరామాలను “త్రిపీటకములు” అని కూడ వ్యవహరిస్తారు. ఈ త్రిపీటకాలు బుద్దుని కాలానివికదా? మరి వీటి ప్రసంగం రామాయణంలో ఎలా వచ్చింది? ఎవరైనా ప్రక్షిప్తం చేశారా? అని పరిశోధకులు వెదకడం ( పరిశోధన) చేసిఉండవచ్చు. రామాయణంలోఈ “ త్రిపీటకముల వెదుకులాట” కాలక్రమంలో “ రామాయణంలో పిడకలవేట” గా మారి వుండవచ్చు అని పరిశోధకుల ఒక వివరణ.

సామెత: సింగినాదం జీలకర్ర

“ సింగినాదం జీలకర్ర” అన్న దాన్ని వివరిస్తాను. ఈసామెతని ఎవరైనా ఒక సామాన్య విషయాన్ని గొప్పగా చెప్పేసందర్భంలో వాడుతారు. సింగినాదంఅన్న పదానికి అర్ధమే లేదు.మరి సింగినాదానికి జీలకర్రకిసంబంధమేలేదు. దీని అసలురూపం “ శృంగనాదం, జీలకర్ర” పూర్వం గోదావరి లంక గ్రామలలోఉండే ప్రజలకు కావలసిన సరకులను పడవలలో వచ్చి అమ్మేవారుట. పడవ వచ్చింది సరకులు కొనుక్కోండి అని తెలపడానిక ‘కొమ్ము బూర ‘ ఊదేవారు.ఆ నాదం విని పడవ వద్దకు వచ్చి కావలసిన సరుకులు కొనుక్కొనేవారు.కొమ్ముబూర శబ్దాన్ని సంస్కృతంలోశృంగనాదం అంటారు. ఆశృంగనాదంవిన్న ఓగృహిణి ఇంకొకరితో” అదిగోశృంగనాదం జీలకర్ర కొనాలి అన్న సందర్భంలో “ఈ శృంగనాదం జీలకర్ర” అన్న సామెత ఏర్పడింది. అదేకాలక్రమంలో “ సింగినాదం జీలకర్రగా”మారింది.

సామెత: పనిలేని మంగలి పిల్లి తల గొరిగేడు


“ పనిలేని మంగలి పిల్లి తల గొరిగేడు” అన్న సామెత ఎలా వచ్చిందో వివరిస్తాను. ముఖ్యమైనపనేమిలేనపుడు ఏదో ఒక పని చేసేసందర్భంలో ఈ సామెత వాడుతారు. పిల్లి తలమీద వెంట్రుకలే ఉండవుకదా! మరి పిల్లి తల గొరగడమేమిటి,ఇది అంత సమంజసంగా లేదు కదా!? మరి ఈ సామెత పూర్వ రూపం ఏమిటి? పూర్వం క్షురకులు వీధి అరుగులమీదో రచ్చబండమీదో కూర్చొని క్షవరం చేసేవారు. ఒకరోజు అలా కూర్చున్నమంగలి వద్దకు ఎవరు రావటంలేదని పని లేనందువలన ఆ మార్గంలో వెళ్ళేవాళ్ళని రారమ్మని పిలిచి తల గొరిగేడట.(క్షవరం చేసేడట) అలా”పనిలేని మంగలి పిలిచి తల గొరిగేడు” అన్న సామెత కాలక్రమంలో “ పనిలేని మంగలి పిల్లి తల గొరిగేడు” అని మారింది.

సామెత: ఇల్లు ఇరకటం ఆలిమరకటం


“ఇల్లు ఇరకటం ఆలిమరకటం” అన్నసామెతతరచూ వింటూవుంటాము. ఇల్లు ఇరుకుగాఉంటేభార్యకోతిలాఉంది అనిఅనటం. అంత సమంజసంగా లేదు కదా! ఈ సామెత అసలురూపం “ ఇల్లు ఇరుకవాటం, ఆలి(భార్య) మరుకవాటం” అనగా ఇంటికి వాస్తురీత్యా కవాటం అంటే కిటికి, కిటికీకి ఎదురుగాఇంకో కిటికీ ఉంటే గాలి,వెలుతురు చక్కగా వచ్చి ఆరోగ్యంగా ఉంటుందనీ, అట్టి ఇంట్లో ఉన్న ఆలి అందమైన మరుకవాటం అంటే మన్మదసామ్రాజ్యానికి గవాక్షం అంటే మార్గమనీఅర్ధం. చూసార! ఎంతచక్కని సామెత ఎలా మారిందో.

35 views0 comments
Join my mailing list

© 2020 by TPN Acharyulu

This site was designed with the
.com
website builder. Create your website today.
Start Now