Search
  • TPN Acharyulu

సంస్కృత న్యాయాలు-ఆధ్యాత్మిక విశేషాలు (2వ భాగం)


శాఖా చంక్రమణ న్యాయం:

శాఖా = కొమ్మలు.


చంక్రమణం=తిరగడం.


అనిఅర్ధం. అంటే వానరం (కోతి)కుదురుగా ఒక కొమ్మ మీద ఉండకుండా,అన్ని కొమ్మల మీదకి ఎగిరి,దూకుతూనే ఉంటుంది. వక్త కాని, రచయిత కాని,ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు అదే కాకుండా,వేరే అనేక విషయాలు వివరిస్తే దానిని “శాఖా చంక్రమణ న్యాయం”అంటారు.

ఉదా: బ్రహ్మ జ్ఞానం తెలియాలంటే వేదాలు,ఉపనిషత్తులు,పురాణాలు,కావ్యాల నుండి అనేక విషయాలు తెలుసుకోవాలి. ఒక పండు కావాలంటే, కాండము, కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పూలు, కాయలు ఎలా కాపాడు కొంటామో, అత్మకోసం దేహం,ఇంద్రియాలు,బుద్ధి ,మనస్సు, అన్నింటిని సక్రమంగా చూసుకోవాలి. మన కోరికలు ,బంధాలు,అనుబంధాలు ఆకులు,పువ్వులు,కాయలు అనుకొంటే,క్రింది కాండానికి నీరుపోసి జాగ్రత్తగా కాపాడు కోవాలి.లేకుంటే,కాండంతో పాటు పైవి కూడాపోతాయి. ఆకాండమే శీలము,విశ్వాసము.వీటిని పోషిస్తే మనకి ఆత్మజ్ఞానమనే పండు లభిస్తుంది.ఇంకా దీనిని చిన్నికథతో వివరిస్తాను.”


పరమానందయ్య శిష్యుల కథలో సారి పదిమంది శిష్యులు నదిని దాటుతారు.ఒడ్డుకు చేరుకోన్నాక అందరు ఉన్నారో లేదో అని లెక్కపెడతారు. ఎన్ని మారులు ఎంతమంది లేక్కపెట్టినా తోమ్మిదిమందే ఉన్నట్లు అనుకొని,ఒక్కడు నదిలో కొట్టుకు పోయాడు అనుకొని బాధ పాడుతారు. ప్రతివాడు తనని వదిలి మిగతావారిని లెక్కించడం వల్ల ఇలాజరుగుతుంది. అప్పుడు ఆడారినిపోయే పెద్దమనిషి వచ్చి వారి ఏడుపుకి కారణం తెలుసుకొని, వారి అమాయకత్వానికి,నవ్వుకొని తను లెక్కించి పదిమంది ఉన్నారని తెల్పి వారి బాధని పోగొట్టి వెళతాడు.” ఇది అందరికి తెలిసిన కథే.కాని దీని వల్ల గొప్ప ఆత్మ జ్ఞాన తత్త్వం మనం తెలుసుకోవచ్చు. అది--

1. తననితానులెక్కించక పోవడం-“అజ్ఞానం”.


2. ఉన్నవాడిని లేడు అనుకోవడం-“ఆవరణ”.


నదిలో కొట్టుకుపోయాడు అనుకోవడం “మిధ్యా జ్ఞానం”.


4. వాడు చచ్చి పోయాడు అని బాధ పడటం-“విక్షేపం”.


5. వేరొకరు వచ్చి లేక్కపెట్టేవాడిని కూడా లెక్కించి,నీవు పదవ వాడివి అనిచేప్పడం,వాడు తననితాను తెలిసికొని ఆనందించడం “ఆత్మజ్ఞానాన్ని”గుర్తించడం.అన్న దానికి చక్కని ఉదాహరణ.ఒక విషయం తెలపడానికి,ఇన్నివిశేషాలు తెల్పడమే”శాఖా చంక్రమణ న్యాయం.”
మణిప్రవాళన్యాయం:


మణులు,ప్రవాళములు అంటే పగడాలు కలిపి హారం చేస్తే అది ఎంత గొప్పగా కనబడుతుందో అలాగే రెండు వేరు వేరు భాషలను ఒకటిగా చేసి,రచన చేస్తే అది మణి ప్రవాళ భాష అవుతుంది. తెలుగు,సంస్కృతం కలసి నట్లు. అట్లే,రెండు వేరు,వేరు విషయాలు కలిపి చెప్తే దానిని మణి ప్రవాళ న్యాయంగా చెప్పవచ్చు. ఉదాహరణ –గీత, ఉపనిషత్తులు. ఇవి రెండు వేరు,వేరు విషయాలు. కానీ ఉపనిషత్ సారమే గీత. `సర్వోపనిషదో గావ:' అన్న గీతా శ్లోకంలో ఉపనిషత్తులు అనే ఆవు నుండి పార్ధుడు అనే దూడ ద్వార కన్నయ్య అనే గొల్లవాడు గీతామృతం అనే పాలను పిండి బుద్ధిమంతులకు ఒసంగెను. అని కదా వ్యాసుడు తెల్పెను. దీనినే వివరంగా తెలుసుకొందాము.

ఉపనిషత్తులు—సత్యాన్న ప్రమదితవ్యం,ధర్మాన్న ప్రమదితవ్యమ్, సత్యాన్ని,ధర్మాన్నివిడువవద్దు. అని చెప్తే, గీత సత్యాన్ని విడువకుండా నీ ధర్మాన్ని నీవు ఆచరించు అని చెప్తుంది. పదినెనిమిది అధ్యాయాల గీతాసారం అదే. దీనిని గీత `ధర్మ క్షేత్రే కురుక్షేత్రే' అన్న మొదటి శ్లోకంలో మొదటిపదం `ధర్మక్షేత్రే' అన్న పదాన్ని`` యత్ర యోగీశ్వర కృష్ణో '', అన్న చివరి శ్లోకంలోని చివరిపదం `మతిర్మమ' అన్న రెండు పదాలను కలిపితే `ధర్మక్షేత్రే మతిర్మమ' అనగా ధర్మమునందే నా బుద్ధి ఉండు గాక' అన్నదే గీతా సారం అని పెద్దలు చెపుతారు. ఇంకా 1. ఉత్సాహం 2. సాహసం 3. ధైర్యం 4. సద్బుద్ధి 5. శక్తి 6. పరాక్రమం. ఆరు గుణాలు ఎక్కడ ఉంటే అక్కడ, భగవంతుడు ఉంటాడు. అన్న గీతాసారం ఉపనిషత్సారమే కదా!. ధర్మాచరణని ఎలా ఆచరించాలో `సత్యవ్రత' ఋషి కథ ద్వారా తెలుసుకొందాం. సత్యమే వ్రతంగా ఆచరించే ఋషి సత్యవ్రతుడు. ఒకరోజు ఒక వేటగాడు పందిని తరుముతూ ఉంటాడు. అది సత్యవ్రతుని ఆశ్రమంలోకి వచ్చి, తనని కపాడమంటుంది.సరే ఆశ్రమం వెనక ఉండు అని అభయం ఇస్తాడు. అప్పుడు వేటగాడు వచ్చి వరాహం ఎటు వెళ్ళిందో చెప్పు.అదినాకు,నా కుటుంబానికి ఆహరం, సత్యం చెప్పడం నీ ధర్మం అని అంటాడు. అప్పుడు సత్యవ్రతుడు ఇలా అంటాడు. `చూసిన కళ్ళు మాటాడ లేవు.మాటాడే నోరు చూడ లేదు' అని. ` నీవు చెప్పింది నాకేమి అర్థం కాలేదు ' అని వేటగాడు వెళ్లి పోతాడు.అలా సత్యవ్రతుడు తన ధర్మాన్ని కాపాడు కొంటాడు. దీనినే `సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూ యాత్,న బ్రూయాత్ సత్యమప్రియం'. అని ధర్మ శాస్త్రం చెపుతుంది.కనుక సత్యధర్మాలని పాటిస్తూ చిన్న విత్తనం నుండి పెద్ద చెట్టు పుట్టినట్లు,చిన్న బిందువులు పెద్ద సముద్రంగా మారినట్లు.


`ఏకం సత్విప్రా: బహుధావదంతి' అన్నపరమసత్యాన్ని తెలుసుకొని మెలగాలని–ఉపనిషత్, గీత బోధిస్తాయి. ఇలా రెండు విషయాలని ఒకటిగా చెప్పడమే `మణిప్రవాళన్యాయం'.28 views0 comments

Recent Posts

See All